2 youths | బైంసా రహదారిపై ఆందోళన

2 youths | బైంసా రహదారిపై ఆందోళన
2 youths | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : బాసరలో ఓ వర్గానికి చెందిన ఇద్దరు యువకులు చత్రపతి శివాజీ మహారాజ్(Chatrapati Shivaji Maharaj), శివాజీ మహారాజ్ తల్లి జిజియా బాయి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో ఇంస్టాగ్రామ్ లో, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంగళవారం బాసర గ్రామస్తులు, హిందూ వాహిని సంఘాలు మండిపడ్డాయి.
స్థానిక శివాజీ చౌక్ వద్ద హిందూ వాహిని సంఘ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ నిజామాబాద్ బైంసా(Nizamabad Baimsa) ప్రధాన రహదారిపై బైఠాయించారు. హిందువుల మనోభావాల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు యువకులను కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేశాయి. సుమారు రెండు గంటలకు పైగా ఆందోళన చేపట్టడంతో ఎక్కడి వాహనలో అక్కడే నిలిచిపోయాయి. విషయం తెలుసుకొన్న అదనపు ఎస్పీ అవినాష్ కుమార్(SP Avinash Kumar) పోలీసులు భారీగా బాసర చేరుకొని నిజామాబాద్ బైంసా(Nizamabad Bainsa) రహదారిపై బైఠాయించిన హిందూ సంఘాల ప్రతినిధులను సముదాయించే ప్రయత్నం చేశారు.

ఈ సందర్భంగా హిందు సంఘాల ప్రతినిధులు పోలీసులతో మాట్లాడుతూ అనుచిత వాక్యాలు చేసిన వారి పై పిడీ ఆక్ట్(PD Act) నమోదు చేసి,కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదనపు ఎస్పీ అవినాష్ కుమార్ మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒకరిని 30 నిమిషాల్లోనే పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని, మరో యువకుడిని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. హిందూ సంఘాల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని బాసరలో భారీగా పోలీసుల బలగలను మోహరించారు. బందోబస్తులో ముధోల్ సిఐ మల్లేష్, ముధోల్, తనూర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
