Srikakulam | రాకపోతే నోటీసులే !!

Srikakulam | రాకపోతే నోటీసులే !!
- జిల్లా కలెక్టర్ స్వప్నిల్
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజా పిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలసి ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా పరిషత్ లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికకు జిల్లా అధికారులు హాజరుకాకుంటే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆయా సమస్యలకు సంబంధించి వివిధ శాఖల నుండి 120 అర్జీలు స్వీకరించారు. సోషల్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ-35, రెవెన్యూ 33, పంచాయతీ రాజ్ 21, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 13, గ్రామీణాభివృద్ధి 3, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2, ఎపిఈపీడిసియల్ 2, విభిన్న ప్రతిభా వంతులు శాఖ 2, మెడికల్ ఎడ్యుకేషన్, సర్వే అండ్ లాండ్ రికార్డులు, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్, ఆర్డబ్ల్యుఎస్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, మౌలిక సదుపాయాలు, సమగ్ర శిక్ష, ఎపి యస్ ఆర్టీసీ ఒక్కొక్క అర్జీ చొప్పున స్వీకరించారు. అర్జీలు స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీ రాజ్ కుమార్, రిటైర్డ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి. జయదేవి, డిఆర్డిఎ పిడి కిరణ్ కుమార్ లు ఉన్నారు. జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు
మన్యదీపిక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రైతు ఉత్పత్తి సంఘాలను అందరం ప్రోత్సహించాలని, చిరు ధాన్యాలలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయన్నారు. చిరు ధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు. వాతావరణానికి అనుగుణంగా పండించే పంటలన్నారు. రైతు సంఘాలను ప్రోత్సహించి సంఘాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. ఎరువులు వేయకుండా పండించే పంటల ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు.
