Temple | అయ్యప్ప స్వాములకు అన్నసంతర్పణ…
Temple | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ పట్టణంలోని వలిగొండ రోడ్డులో ఉన్న శ్రీ బాలాజీ రామకృష్ణ దేవాలయం(Sri Balaji Ramakrishna Temple)లో అయ్యప్ప స్వామి నిత్య అన్న సంతర్పణ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అయ్యప్ప స్వామి మాలదారులకు బైరెడ్డి పద్మావతి కుమారుడు బైరెడ్డి రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్న సంతర్పణ చేశారు.
వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్ల వేళల ఉండాలని, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలు, అయ్యప్ప స్వామి(Ayyappa Swamy) ప్రసాదించాలని అయ్యప్ప స్వామి మాలదారులు, శివదీక్ష మాలదారులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో అన్న సంతర్పణ నిర్వాహకులు తోర్పునూరి నర్సింహ గౌడ్(Thorpunuri Narasimha Gowda), సన్నిధానం గురుస్వామి చెరుకు అశోక్, కళ్ళెం నాగరాజు, చెవగొని మహేష్, వరగంటి వెంకటేష్, స్వాములు మార్గం శేఖర్ యాదవ్, అందొజు సన్నిధ్ చారి, పోల్డాస్ రాజు, తోర్పునూరి సాయి, సాయిలు, శివ ప్రసాద్, ఆలయం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ పగిడోజు సంతోష్ కుమార్ శాస్త్రి, ఆలయం కమిటి మెంబెర్స్ తదితరులు పాల్గొన్నారు.

