iBomma | నిర్వాహకుడు అరెస్ట్
iBomma | హైదరాబాద్, ఆంధ్రప్రభ : పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma)కు కీలక నిర్వాహకుడిగా ఉన్న ఇమ్మడి రవి (Immadi Ravi) ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఫ్రాన్స్ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకున్న అతడిని కూకట్‌పల్లి ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటంటే, రవి కరేబియన్ దీవుల్లో నివసిస్తూ ఐబొమ్మ (iBomma) వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నాడు. అరెస్ట్ అనంతరం అతడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేయడంపై గతంలో తెలుగు ఫిల్మ్ యాంటీ పైరసీ టీమ్ సైబర్ క్రైమ్ పోలీసుల (Cybercrime police) కు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ వెబ్‌సైట్ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసిరిన నేపథ్యంలో, సైబర్ క్రైమ్ బృందం ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకుని దర్యాప్తు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఐబొమ్మకు సంబంధించిన ఏజెంట్లను కూడా అరెస్ట్ చేశారు. బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌లలోని నిందితులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

