Mahabubnagar | ఐదుగురు నిందితుల రిమాండ్

Mahabubnagar | ఐదుగురు నిందితుల రిమాండ్
Mahabubnagar | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ ఎస్ బి ఐ బ్యాంకులో నగదు అవకతవకలకు పాల్పడిన ఐదుగురు నిందితులను రిమాండ్ తరలించినట్లు మక్తల్ సీఐ రామ్ లాల్, ఊట్కూర్ ఎస్సై రమేష్ వెల్లడించారు. ఈ రోజు నిందితులను రిమాండ్ తరలించి విలేకరులకు వివరాలు వెల్లడించారు.
ఊట్కూర్ శాఖ ఎస్బిఐ బ్యాంకులో 2016 నుండి 2019 వరకు నకిలీ పట్టా పాస్ పుస్తకాలను సృష్టించి, బ్యాంకు అధికారులు, మధ్యవర్తులు (బ్రోకర్లు) కలిసి 414 ఖాతాలలో సుమారు రూ 3.91 కోట్ల మేర అవకతవకలు జరిపినట్లు విచారణలో తేలినట్లు వివరించారు.
ఈ కేసులో ప్రధాన నిందితులను…
ఎస్సార్ నాగరాజు (బ్యాంక్ మేనేజర్, హైదరాబాద్.)
మంత నరేష్ ( క్యాషియర్, నారాయణపేట)
పూడూరు సత్యనారాయణ ( ఊట్కూర్ మండలం తిప్రాసుపల్లి,),
మలీ పటేల్ సోమిరెడ్డి, (పెద్దపోర్ల)
జి కుర్మిరెడ్డి (దండు, మక్తల్,)
ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.
బ్యాంక్ అధికారుల సహకారంతో నకిలీ పట్టా పాస్ పుస్తకాలు, తప్పుడు ఖాతాల ఆధారంగా జరిగిన ఈ పెద్ద స్థాయి మోసం పై మేము పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నాము. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము అని తెలిపారు.ఈ దర్యాప్తు కొనసాగుతూ, ఇంకా మరి కొంత మంది నిందితులపై ఆధారాలు సేకరించ బడుతున్నాయని, ఆర్థిక నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
