Minister | రైతులకు డ్రైయర్ యంత్రం..
Minister | హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : రైతులు పండించిన వరి ధాన్యం ఆర పెట్టుకునేందుకు అవసరమైన డ్రైయర్ యంత్రంను ఈ రోజు మార్కెట్ కమిటీ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశుముఖ్(Radhika Arun Kumar Deshmukh) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర నీటి పారుదల ఫౌరసరరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) సహకారంతో హుజూర్ నగర్ మార్కెట్ యార్డ్ కు రైతులకు అవసరమైన డ్రైయర్ యంత్రం(Dryer Machine)ను మంజూరు చేయించారన్నారు.
రైతులు పండించిన వరి ధాన్యం నిల్వ చేసుకోవాలన్నా, అమ్ముకోవాలన్నా ఈ డ్రైయర్ యంత్రంని పయోగించుకోవచ్చు అన్నారు. మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన డ్రైయర్ యంత్రాన్నీ రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ II గ్రేడ్ ఉన్నతాధికారి ఘని, సిబ్బంది రైతులు పాల్గొన్నారు.

