Nalgonda : వైక‌ల్య గుర్తింపు కార్డుల‌ జారీ కేంద్రం…

Nalgonda : వైక‌ల్య గుర్తింపు కార్డుల‌ జారీ కేంద్రం…
– మెరుగైన సేవ‌లు

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రసవాల నిర్వహణలో నల్గొండ జిల్లా(Nalgonda District) ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందుందని అన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) అన్నారు. ఈ రోజు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 30 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రత్యేక వైకల్య గుర్తింపు కార్డుల జారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉస్మానియా, గాంధీ తర్వాత ఎక్కువగా ప్రసవాలు నిర్వహించే అతిపెద్ద ఆస్పత్రిగా నల్గొండ జీజీహెచ్ పేరు పొందిందని, ప్రతినెల 700 నుండి 800 వరకు(700 to 800 per month) ప్రసవాలు చేయడం జరుగుతున్నదని ఆయన తెలిపారు.


గతంలో ఉన్న సదరం శిబిరం కేంద్రంలో ఎలాంటి సౌకర్యాలు ఉండేవి కాదని, సౌకర్యాల లేమితో వైకల్యం కలిగిన వారు అనేక ఇబ్బందులను ఎదుర్కోవడాన్ని దృష్టిలో ఉంచుకొని 30 లక్షల రూపాయల వ్యయంతో నూతన భవనాన్ని నిర్మించి వికలాంగులకు కొత్త భవనంలో తాగునీరు, టాయిలెట్స్, ర్యాంపు(toilets, ramp) ఇతర అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.

వైకల్యం కలిగిన వారు ఇక ప్రతివారం ఎలాంటి ఇబ్బంది లేకుండా సర్టిఫికెట్లు పొందవచ్చని అన్నారు. ఇప్పటివరకు దృవపత్రాలు రాని వారికి ధ్రువపత్రాలు జారీ చేయడం జరుగుతుందని, సదరం ధ్రువ పత్రాల ఆధారంగా పెన్షన్(pension) రాని వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలు ఏ ఇతర ఆస్పత్రిలో లేవని, ఆసుపత్రిలో అన్ని అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

ఇందులో భాగంగా ఇటీవలే బేబీ వార్మ్స్, లాప్రోస్కోపిక్ మిషన్(baby worms, laparoscopic mission) వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని, రెండు, మూడు లక్షల రూపాయల విలువ చేసే ఆపరేషన్లు సైతం ఉచితంగా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేస్తున్నామ‌న్నామ‌నీ ఇవి సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రసవాల కోసం ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లకుండా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి రావాలని, ఇందుకు ఆశ, అంగన్వాడీ, ఆస్పత్రికి సిబ్బంది, అంబులెన్స్ వాహనాల డ్రైవర్లు(ambulance vehicle drivers), డాక్టర్లు కృషి చేయాలని మంత్రి అన్నారు.

వైద్య సేవలలో నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని రాష్ట్రంలోనే నంబర్ వన్ గా నిలపాలన్నదే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi), డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి, ఆర్ డిఓ వై.అశోక్ రెడ్డి, జిల్లా ఆస్పత్రి సూపరింటిండెంట్ అరుణ కుమారి, ఆర్ఎంవో, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply