Chittoor | సమైక్యతా శిల్పి సర్దార్‌ పటేల్‌

Chittoor | సమైక్యతా శిల్పి సర్దార్‌ పటేల్‌

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : స్వాతంత్ర్యానంతరం రాజరిక, నవాబ్ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో చరిత్రాత్మక పాత్ర పోషించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఈ ఘనత దక్కుతుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు (MP Daggumalla Prasad Rao) తెలిపారు. సమైక్యతా శిల్పి సర్దార్‌ పటేల్ అన్నారు. చిత్తూరు (Chittoor) జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహ కూడలిలో బుధవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జిల్లా స్థాయిలో రాష్ట్రీయ ఏక్తా దివస్ (rashtriya ekta diwas) కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద్ రావు ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ (Collector Sumit Kumar), చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, చూడా ఛైర్మన్ కటారి హేమలత, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర సమరయోధుడిగా, దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచారని పేర్కొన్నారు. రక్తపాతం లేకుండా కాశ్మీర్, హైదరాబాద్ వంటి సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడం ఆయన దూరదృష్టి, రాజకీయ ప్రావీణ్యానికి నిదర్శనమని అన్నారు.

భారతదేశ తొలి హోంమంత్రిగా ఆయన చేసిన సేవలు అప్రతిహతమని, కానీ చరిత్రలో ఆయనకు తగిన స్థానం ఇవ్వలేదని విచారించారు. ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) స్ఫూర్తిగా గుజరాత్‌లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ రూపంలో ఆయనకు స్మారక చిహ్నం నిర్మించారని గుర్తుచేశారు. ఎన్‌డిఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ ద్వారా ఆయన ఆలోచనలను, ఐక్యత సందేశాన్ని ప్రజలకు చేరవేయడమే లక్ష్యమని ఎంపీ వివరించారు.

Leave a Reply