Mass Jatara | సమ్మర్ రేస్ నుండి తప్పుకున్న ‘మాస్ జాతారా’ !

మాస్ మహారాజ్ రవితేజ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. ఈ చిత్రానికి భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.

కాగా, మే 9న ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించగా.. తాజాగా మరోసారి మాస్ జాతారా వాయిదా పడినట్లు తెలుస్తొంది. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు మేకర్స్.. అయితే, సెట్స్‌లో రవితేజ గాయపడటంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి మూవా వాయిదా పడింది.

ఇక ఈ చిత్రంలో రవితేజ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పిఎఫ్) అధికారిగా కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్‌ నిర్మిస్తోంది. బలగం ఫేమ్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *