జాగృతి జ‌నం బాట‌లో…

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములను కోల్పోయిన భూ నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఆమె నల్లగొండ జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించారు.

మొదట ఆమె డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Dindi Lift Irrigation Project) పరిధిలో భాగంగా నిర్మిస్తున్న కిష్ట రాయనిపల్లి రిజర్వాయర్ను సందర్శించారు. అక్కడే కిష్టరాయన్ పల్లి, శివన్న గూడెం రిజర్వాయర్ల నిర్మాణాలతో భూములు కోల్పోయిన భూనిర్వాసులతో మాట్లాడారు. డిండి పూర్తయితే వేలాదిమందికి లాభం జరుగుతుందన్నారు. 2015 లోనే ప్రాజెక్టు పూర్తి(project will be completed in 2015 itself) అయితే ఇబ్బందులు తప్పేవ‌న్నారు.

11 సంవత్సరాలు ఆలస్యం కావడంతో అప్పుడు మైనర్లుగా ఉన్నవారు ఇప్పుడు మేజర్లుగా మారారన్నారు. భూ నిర్వాసితులకు ఇప్పటివరకు ఇండ్లను నిర్మించి ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను వారికి కట్టించిన ఇళ్లలో దిగ పెట్టేవరకు వారికి నెలనెలా ఖర్చు ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. భూ నిర్వాసితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించేందుకే తాను ఇక్కడికి వచ్చానని కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavita) చెప్పారు. గతంలో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీలు వేల కోట్లు ఖర్చు చేశాయన్నారు. అప్పుడు మీకు న్యాయం చేస్తానని చెప్పిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

ప్రస్తుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నమ్మిన ప్రజలను మోసం చేస్తున్నాడని కల్వకుంట్ల కవిత విమర్శించారు. భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం అందరం చర్చించి ఒక తేదీని నిర్ణయించుకుని నల్లగొండలో కానీ హైదరాబాదులో కానీ ఆందోళన(agitation in Nalgonda but not in Hyderabad) కార్యక్రమాలను చేపడతామని ఆమె భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. అనంతరం చింతపల్లి సాయిబాబా దేవాలయం లో పూజలు నిర్వహించారు, అక్కడి నుండి నక్కలగండి ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నట్లు సమాచారం.

Leave a Reply