కేజీబీవీ విద్యాలయం ఆకస్మిక తనిఖీ..
- విద్యార్థులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్..
జూలూరుపాడు, ఆంధ్రప్రభ : కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యాలయంను(KGBV Vidyalaya) జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించి, పాఠశాల బాలికలతో ముచ్చటించారు. విద్యార్థినీలతో కలసి కలెక్టర్ క్యూ లైన్లో(collector queue line) నిలుచుని మధ్యాహ్న భోజనం చేశారు.

భోజనం సందర్భంగా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని ఏ ఉద్యాగాల్లో స్థిరపడతారు అని కలెక్టర్ బాలికలను ప్రశ్నించారు. పాఠశాలలోని కిచెన్, స్టోర్ రూమ్లను(Kitchen, Store Rooms) తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పదవ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలని, డిగ్రీ వరకు చదువుకుని జీవితంలో స్థిరపడిన అనంతరం అమ్మాయిలు పెళ్లి ఆలోచన చేయాలని జితేష్ వి పాటిల్ అభిప్రాయ పడ్డారు. బాలికలు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధిస్తామని ఆకాంక్షతో ఉన్నారన్నారు. కేజీబీవీ పాఠశాలలో(KGBV School) విద్యార్థినులను చదివిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు.
పాఠశాల నిర్వహణ పట్ల కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. బాలికలు ఆటలు ఆడుకునేందుకు ప్లే గ్రౌంగ్కు గ్రావెల్, కంప్యూటర్లు, దోమలు రాకుండా కిటికీలకు మెస్ ఏర్పాటు, ఎస్సీ హాస్టల్ నుంచి కేజీబీవీ వరకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని పాఠశాల ప్రిన్సిపాల్ పద్మజా, పీడీ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్ళారు. సమస్యలను పరిష్కరిస్తానని జితేష్ వి పాటిల్(Jitesh V Patil) హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ తూమాటి శ్రీనివాస్, ఎంపీడీఓ పూరేటి అజయ్ ఎంపీడీఓ కార్యాలయం సూపరిటెండెంట్ తాళ్లూరి రవి, ఎంపీఓ తులసి రాం, జూలూరుపాడు పంచాయతీ కార్యదర్శి ఖాదర్ మియా తదితరులు పాల్గొన్నారు.

