బాసరతో అందెశ్రీకి అవినాభావ అనుబంధం
బాసర, ఆంధ్రప్రభ : తెలంగాణ సాహితీ పితామహుడు, తెలంగాణ ఉద్యమంలో తనదైన శైలిలో రచనలతో ప్రజలను ఉద్యమం వైపు తిప్పిన ప్రముఖ సాహితీ కళాకారుడు అందెశ్రీ (Andesri) కి బాసర క్షేత్రంతో అవినాభావ సంబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారిని దర్శించుకుని రచనలు చేసేవారని ఆయన శిష్యులు తెలిపారు.
తన వాక్చాతుర్యాం, రచనలకు శ్రీ జ్ఞాన సరస్వతి (Sri Gyan Saraswati) అమ్మవారి కరుణ కటాక్షాలు ఉన్నాయని గుర్తు చేసేవారు. రెండు నెలల క్రితం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం తరఫున వీరిని సత్కరించి ప్రసాదాలు సైతం అందజేశారు. ప్రముఖ సమాజ సేవకుడు కె ప్రతాప్ రావు అందెశ్రీ తో తనకున్న సంబంధాలను గుర్తుచేసి కన్నీటి పర్యంతమయ్యారు.


