అర్హులు త‌ప్పిపోవ‌ద్దు

అర్హులు త‌ప్పిపోవ‌ద్దు

  • SIRపై అవ‌గాహ‌న అవ‌స‌రం
  • తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్

చెన్నై, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితా (SIR) సమయంలో అర్హత ఉన్న ఓటర్లలో ఎవరూ తప్పిపోకుండా చూసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్(M.K. Stalin) ఈ రోజు తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితా (SIR)పై ప్రజల్లో అవగాహన సరిపోలేదని తెలిపారు. ప్ర‌జ‌ల‌తో తాను జ‌రిపిన సంభాష‌ణ‌లో వెల్ల‌డైంద‌ని స్టాలిన్ పేర్కొన్నారు. “చాలా చోట్ల, బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) వంటి పోలింగ్ అధికారులు(polling officials) కూడా దీనిని అర్థం చేసుకోలేదని ప్రజలు చెప్పారు” అని DMK అధ్యక్షుడు స్టాలిన్ తెలిపారు.

Leave a Reply