ఇది పేదోళ్ల సొంతింటి కల…

ఇది పేదోళ్ల సొంతింటి కల…
నర్సంపేట, ఆంధ్రప్రభ : ఇందిరమ్మ రాజ్యంలో పేదవారి సొంతింటి కల నెరవేరబోతుందనీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(Donthi Madhav Reddy) అన్నారు. నర్సంపేట మండలం భాంజీపేట గ్రామంలో ఆరెల్లి రచన ఇంటి నిర్మాణం పూర్తి చేయగా ఈ రోజు ప్రారంభోత్సవం చేశారు. నర్సంపేట మండల కేంద్రంలో మొట్టమొదటి ఇల్లు గృహప్రవేశానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిరెడ్డి హాజరై రిబ్బన్ కట్(ribbon cut) చేసి ప్రారంభించారు. లబ్దిదారుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్లతో పేద ప్రజల సొంతింటి కల నెరవేరుతుందన్నారు. నియోజక వర్గంలో 3750 ఇండ్లు మంజూరు(3750 houses sanctioned) అయ్యాయని వివిధ దశలలో ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
