అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా…

అన్ని వ‌ర్గాల‌కు అండ‌గా…

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో హరితా రిసార్ట్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి(State Chief Minister A Revanth Reddy) జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతతూ.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశ పెట్టి అన్ని వర్గాలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ముందుకు వెళ్తుందని అన్నా రు.

ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఏఎంసీ చైర్మన్ పడిగెల భూషణ్, ఖానాపూర్ ఏఎంసీ డైరెక్టర్ లు మసుకు రాజేందర్ రెడ్డి, కసుల భూమన్న, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పీ. సతీష్ రెడ్డి, ఖానాపూర్ ఆత్మ కమిటీ డైరెక్టర్ డీ.రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు టీ. శంకర్. యూత్ కాంగ్రెస్ కడెం మండల అధ్యక్షుడు రెంకాల శ్రీనివాస్ యాదవ్, పెద్దూర్ కడెం మాజీ సర్పంచ్ కే.అనూష లక్ష్మణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply