ఘ‌నంగా జ‌న్మ‌దిన సంబురాలు

ఘ‌నంగా జ‌న్మ‌దిన సంబురాలు

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Chief Minister Enumula Revanth Reddy) జన్మదిన వేడుకలు ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఊట్కూర్ ప‌ట్ట‌ణంలోని శ్రీరామ్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయంలో సీఎం జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సింగిల్ విండో అధ్యక్షుడు బాల్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి.

యగ్నేశ్వర్ రెడ్డి(Yagneshwar Reddy), మాజీ జెడ్పీటీసీలు సూర్యప్రకాశ్ రెడ్డి, మణెమ్మ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సీఎం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అర్హులైన పేదవారికి అందే విధంగా చూడాలన్నారు. ప్రపంచ దేశాల్లో తెలంగాణ అభివృద్ధి చెందేందుకు సీఎం ఎంతో కృషిచేస్తున్నారని ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కోరం మహేశ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొక్కులింగం, నాయకులు కార్యకర్తలు శివరామరాజు, కుర్వ వెంకటేష్, ఇబ్రహీం, శంకర్, రవికుమార్, మధు, శబ్బు, అశోక్, రాఘవేందర్ గౌడ్, నరసింహ, నరేష్, అంజాద్, అర్పత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply