న‌ష్టాన్ని గుర్తించాల‌ని ఆందోళ‌న‌

చల్లపల్లి మచిలీపట్నం ప్రధాన రహదారిపై రైతుల ధర్నా

చల్లపల్లి (ఆంధ్రప్రభ) : మొంథా తుఫాన్ కారణంగా జ‌రిగిన పంట న‌ష్టాన్ని అధికారులు గుర్తించాల‌ని, చల్లపల్లి మండలం చింతలమాడకు చెందిన రైతులు మచిలీపట్నం ప్రధాన రహదారి లక్ష్మీపురం వద్ద ధర్నా చేపట్టారు. చల్లపల్లి పరిసర ప్రాంతాలకు నష్టపరిహారం రాసిన అధికారులు చింతలమడ గ్రామంలో పంట నిలబడి ఉన్నప్పటికీ సుంకు మొత్తం రాలిపోయి తేల గింజలు వస్తున్నాయని, చాలా నష్టం జరుగుతుందని, దిగుబడులు రావని రాశారు. మా గ్రామానికి కూడా అధికారులు నష్టపరిహారం రాయాలని రైతులు కోరుతూ ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

Leave a Reply