- పోలీసులపై దాడి చేసిన కేసులో శిక్ష
ఆంధ్రప్రభ, ఏపీ న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి : కర్రా కళ్యాణ్ దళితుడు. రెండున్నర ఏళ్లుగా నాగాలంక పోలీసు స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. 2018 నవంబర్ 18 రాత్రి 7.30 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు నాగాయలంక స్మశానం వద్ద మద్యం తాగుతూ గొడవ చేస్తున్నారని సమాచారం రాగ, ఏఎస్ ఐ., హెడ్ కానిస్టేబుల్, పోలీసు కానిస్టేబుల్ సహా కళ్యాణ్ వెళ్లి చూడగా అక్కడ భోగాది శివ విష్ణు వర్ధన్, అశోక్ ఉన్నారు. ఇద్దరినీ తీసుకువచ్చి ఐపీసీ 290,510 సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి పంచించారు.
మళ్లీ 8 గంటల 45 నిమిషాలకు యూనిఫాంలో కళ్యాణ్, హెడ్ కానిస్టేబుల్ నాగాయలంక సెంటర్ కు వెళ్లారు. కళ్యాణ్ బండికి AP 17 BM 6779 బండిని అడ్డుపెట్టి ఏంట్రా మాల లంజా కొడకా అంటూ కళ్యాణ్ ను దుర్భాషలాడి విధులకు ఆటంకం కలిగించారు. హెడ్ కానిస్టేబుల్ పడదోసి మీరు ఏంట్రా మాకు చెప్పేది అంటూ తిట్టినట్లు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భోగాది శివ విష్ణు , అశోక్ ను బందరు 10వ ఎస్సీ. ఎస్టీ కోర్టు జడ్జి బి.బాబు నాయక్ U/s 235(2) Cr. P. C ప్రకారం మూడేళ్లు జైలు, ఒక్కొక్కరికి మూడు వేలు జరిమానా విధించారు ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష పడడంలో కృషిచేసిన అప్పటి ట్రైల్ పబ్లిక్ ప్రాసిక్యూటివ్ కె. చంద్రశేఖర రావు, ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎల్ వెంకటేశ్వరరావు, కోర్ట్ మానిటరింగ్ సిస్టం ఏఎస్ఐ ఏవి ప్రసాద్ ,సిబ్బందిని కృష్ణా జిల్లా ఎస్పీ వి.విద్య సాగర్ నాయుడు ప్రత్యేకంగా అభినందించారు.

