నలుగురు మావోయిస్టులు మృతి..
ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లా తార్లగూడెం పరిధి మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలతో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మద్దేడు ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు ఉన్నారని సమాచారం. తాళ్లగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్నారం – మరికెళ్ల అడవుల్లో భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ప్రస్తుతం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి.

