కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది – భట్టి

కాంగ్రెస్ ను ముట్టుకుంటే.. తెలుస్తుంది – భట్టి

కాంగ్రెస్ అంటే.. కరెంట్, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కరెంట్ ఉండదు అంటూ విమర్శలు చేశారు. అలా విమర్శలు చేసిన వాళ్లు కరెంట్ తో పాటు కాంగ్రెస్ ను ముట్టుకుంటే తెలుస్తుందని భట్టి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. పరిగిలో 755 కోట్లతో మంజూరైన విద్యుత్ సబ్ స్టేషన్లను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రామ్ మోహన్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. కరెంట్ ఉండదు అనే ప్రతిపక్షాల నోళ్లు మూయించామని అన్నారు. ప్రపంచంతోనే పోటీపడేలా.. అభివృద్దే ధ్యేయంగా.. తెలంగాణను మరింత ముందుకు నడిపించాలనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ రైజింగ్ ను ఏ ప్రతిపక్షం ఆపలేదన్నారు. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ అందివ్వడంతో పాటు 53 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ అందిస్తున్నామని చెప్పారు. జిల్లాలో 2 లక్షల 48 వేల 77 కరెంట్ కనెక్షన్లు ఉంటే..అందులో 1 లక్ష 40 వేల 194 కుటుంబాలకు ఉచిత కరెంట్ వర్తిస్తుందన్నారు. 56 శాతం కుటుంబాలు ఉచిత కరెంటును పొందుతున్నారని చెప్పారు. పరిగి నిజయోకవర్గంలో 44,665 కుటుంబాలు ఉచిత కరెంట్ పొందుతున్నారని భట్టి తెలియచేశారు. ఇందుకు గాను 1252 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. దేశంలోనే తెలంగాణను అగ్ర స్థానంలో నిలబెడతామన్నారు.

Leave a Reply