కొన‌సాగుతున్న ఇంటింటి ప్ర‌చారం..

కొన‌సాగుతున్న ఇంటింటి ప్ర‌చారం..

హైద‌రాబాద్‌, ఆంధ్రప్రభ : టీపీసీసీ ఆదేశాల మేరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, మార్కెట్ కమిటీ చైర్మన్, ఆసిఫాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ చైర్మన్ కుడిమేత విశ్వనాత్ రావు(Kudimetha Vishwanath Rao) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణ నగర్ ఏ బ్లాక్(Krishna Nagar A Block)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెల్పించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

వారితో పాటు ఆసిఫాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండా శ్యామ్, మంచిర్యాల జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు నందు నాయక్, ఆత్రం దత్తు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply