నాగోల్ మిస్టరీ రివీల్..

  • చోరీ కేసును చేదించిన పోలీసులు

నాగోల్, (ఆంధ్రప్రభ) : నాగోల్, (ఆంధ్రప్రభ): నాగోల్ సాయినగర్ కాలనీలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భాస్కర్ ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసులో పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఎల్బీనగర్ అదనపు డీసీపీ వెంకటేశ్వరరావు మంగళవారం మీడియాకు వెల్లడించారు.

గత నెల 30న భాస్కర్ నివాసంలో కిటికీ గ్రిల్ తొలగించి సుమారు 40 తులాల బంగారం, వెండి ఆభరణాలు దొంగిలించిన ఘటన కలకలం రేపింది. కాలనీలోని సీసీ కెమెరా దృశ్యాలు, ఫింగర్‌ప్రింట్ ఆధారాలు సేకరించిన పోలీసులు, నిందితులు పాత నేరస్తులని గుర్తించారు. కిన్నెర మధు, ఉప్పుటూరు నవీన్ అనే ఇద్దరినీ అరెస్ట్ చేసి, వారివద్ద నుండి రూ.40 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ ఇద్దరు ఇటీవలే జైలు నుంచి విడుదలై మళ్లీ నేరానికి పాల్పడ్డారని విచారణలో తేలిందని డీసీపీ వివరించారు. కేసు విచారణలో కృషి చేసిన నాగోల్ సిఐ మక్బూల్ జానీ, ఎల్బీనగర్ క్రైమ్ టీంను ఆయన అభినందించారు.

ప్రజలు ఊర్లకు వెళ్తున్నప్పుడు పోలీసులకు ముందస్తుగా సమాచారం ఇవ్వాలని, విలువైన బంగారం, వెండి అభరణాలను అలాగేఅధిక మొత్తంలో డబ్బులను తాళం వేసిన ఇళ్లలో ఉంచరాదని ఆయన సూచించారు. అదేవిధంగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం భద్రతకు కీలకం అని పేర్కొన్నారు.

ఈ కేసును చేదించిన నాగోల్ పోలీస్ స్టేషన్ సిఐ మక్బూల్ జానీ, ఎల్బీనగర్ క్రైమ్ టీం ని అడిషనల్ డీసీపీ వెంకటేశ్వరరావు ఎల్బీనగర్ ఏసిపి కృష్ణయ్య గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు.

Leave a Reply