ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి
ఆదేశించిన భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి
మోత్కూర్, నవంబర్ 4 (ఆంధ్రప్రభ) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలో సింగిల్ విండో ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం యాదాద్రి భువనగిరి ఆర్డిఓ ఎం కృష్ణారెడ్డి (M Krishna Reddy) పరిశీలించారు. నిత్యం వర్షాలు కురుస్తున్న నేపద్యంలో దాన్యంలో తేమ శాతం రాక రైతులు ఇబ్బందులు పడతారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తేమ శాతం ఉన్న రైతుల ధాన్యాన్ని తక్షణమే తూకాలు వేసి మిల్లులకు తరలించాలని ఆర్డీవో కృష్ణారెడ్డి బ్యాంక్ సి ఈ ఓ వరలక్ష్మి ని ఆదేశించారు.
లారీ లోడ్ ధాన్యం కోసం ఎదురు చూడవద్దని,తేమ శాతం కలిగిన రైతుల ధాన్యాన్ని తూకాలు వేసి వెంటనే ట్రాక్టర్ల ద్వారానైనా మిల్లులకు తరలించాలన్నారు .ఈ సందర్భంగా ఆర్ డి ఓ రైతులతో మాట్లాడి వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండి విదిగా ధాన్యపు రాశులపై టార్పాలిన్ లు కప్పుకోవాలని సూచించారు. ఆయన వెంట తహసిల్దార్ జ్యోతి, ఆర్ ఐ సుమన్ ,ఏవో కీర్తి ,సిబ్బంది శ్రీకాంత్ చారి తదితరులున్నారు.

