కొత్త పనుల గుర్తింపుకు గ్రామ సభలు
వాంకిడి, ఆంధ్రప్రభ : వాంకిడి మండలంలోని కనార్గాం, పటగూడ, చిచ్చుపల్లి(Kanargam, Pataguda, Chichupalli) గోయెగాం గ్రామపంచాయతీ లలో ఉపాధి హామీ పథకంలో రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్లానింగ్ ప్రాసెస్ లో భాగంగా కొత్త పనుల గుర్తింపు కోసం గ్రామ సభలు నిర్వహించారు. కనార్గావ్ గ్రామ(Kanargaon village) సభకు హాజరు అయిన ఉపాధి హామీ ఏపీఓ. శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలో గత సంవత్సరం జరిగిన పనుల వివరాలు, కూలీలకు చెల్లించిన వేతనాలు వివరించారు.
కొత్త పనుల కొరకు రైతులు స్థానిక పంచాయతీ కార్యదర్శి దగ్గర జాబ్ కార్డ్, పట్టా పాస్ బుక్ జిరాక్స్(Patta Passbook Xerox) లతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో అనుమతించబడిన పనుల జాబితాను గ్రామ సభలో ప్రజలకు చదివి వినిపించారు. ఈ గ్రామ సభలో ఏపీఓతో పాటుగా సాంకేతిక సహాయకుడు బొమ్మెన వెంకటేష్, పంచాయతీ కార్యదర్శి సౌమ్య, క్షేత్ర సహాయకుడు రాజ్ కుమార్, పెసా మొబిలైజర్, ఉపాధి హామీ కూలీలు, రైతులు పాల్గొన్నారు.

