బ్రేకింగ్ న్యూస్‌ – వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు

బ్రేకింగ్ న్యూస్‌ – వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు

నేడు కృష్ణా జిల్లాలో మోంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో వై.ఎస్. జగన్ మాట్లాడనున్నారు. అయితే.. కూటమి ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటన పై ఆంక్షలు విధించింది. కేవలం 500 మంది, 10 వాహనాలకు మాత్రమే అనుమతించారు. రామరాజుపాలెం, ఆకుమర్రు, సీతారామపురం, ఎస్.ఎన్ గొల్లపాలెంలో మాత్రమే పర్యటించాలని సూచించారు. ద్విచక్ర వాహనాలకు ఎలాంటి అనుమతి లేదంటూ ఆంక్షలు విధించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, మండల, గ్రామ నాయకులకు నోటీసులు జారీ చేశారు.

Leave a Reply