ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపను – శ్యామల

ఎన్ని కేసులు పెట్టినా పోరాటం ఆపను – శ్యామల

కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధంచి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్ లో 27 మంది పై గత నెల 30న కేసు నమోదు చేశారు. వారిలో పలువురికి నోటీసులు పంపించారు. వైసీపీ అధికార ప్రతినిధి ఆర్. శ్యామల, కారుమూరి వెంకటరెడ్డి, రాయలసీమ యునైటెడ్ ఫోర్స్ ప్రతినిధి టి.నాగార్జున రెడ్డి, వైసీపీ అభిమాని నవీన్, సీవీ రెడ్డిలను పోలీసులు విచారించారు.

శ్యామలను గంటన్నర సేపు విచారించారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, మహిళా ఎస్సైల సమక్షంలో ఆమెను ప్రశ్నించారు. అవాస్తవాలు ఎందుకు ప్రచారం చేసారని అడిగితే.. వైసీపీ అధికార ప్రతినిధి కావడంతో పార్టీ ఆదేశాల మేరకు ఇచ్చిన స్క్రిప్ట్ చదివానని శ్యామల తెలియచేశారని సమాచారం. అయితే.. విచారణ తర్వాత మీడియా ముందుకు వచ్చిన శ్యామల మాట్లాడుతూ.. వైసీపీ కార్యాలయంలో అధికార ప్రతినిధిగా పది ప్రశ్నలు అడిగానని.. అందులో తప్పు ఏముందని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా.. విచారణ పేరుతో ఎన్ని సార్లు తిప్పినా పోరాటం ఆపనని అన్నారు.

Leave a Reply