పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం..
రాజంపేట (బిక్కనూర్) ఆంధ్రప్రభ : జన వ్యాసాల మధ్య ఉన్న వైన్ షాపును వెంటనే తొలగించాలని రాజంపేట గ్రామ(Rajampet village) ప్రజలు కోరారు. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారులను(Excise Officers) కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. జనవాసాల మధ్య వైన్ షాప్(Wine Shop) ఉండడం వల్ల మన కుటుంబాలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు.
మద్యం సేవించి జనవాసాల మధ్య మూత్ర విసర్జన చేస్తున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం కొనసాగుతున్న వైన్ షాపును గ్రామం బయట ఏర్పాటు చేయాలని తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

