సిద్ధిరామేశ్వర స్వామికి కార్తీకమాస పూజలు

సిద్ధిరామేశ్వర స్వామికి కార్తీకమాస పూజలు

బిక్క‌నూర్‌, ఆంధ్ర‌ప్ర‌భ : దక్షిణ కాశీగా పేరుపొందిన బిక్కనూర్ సిద్ధిరామేశ్వర(Bikaner Siddhi Rameshwaram) ఆలయంలోఈ రోజు కార్తీకమాస పూజలు ఘ‌నంగా నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పలు ప్రాంతాల నుండి వందలాదిగా భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఆలయంలో గల మూలభావి నీటితో భక్తులు స్నాన‌మాచారించారు. అనంతరం ఆలయంలో గల మూలవిరాట్ స్వామి(Moolavirat Swamy)ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో లక్ష దీప పూజ కార్యక్రమం నిర్వహించారు. పలువురు దంప‌తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజల అనంతరం ఆలయ ప్రాంగణంలో మహిళలు పెద్ద ఎత్తున దీపాలను వెలిగించారు. శివనామ స్మరణం(Shivanama remembrance)తో ఆలయం మారుమోగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయానికి వచ్చినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వాన అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి వరకు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగాయి. ఆలయ ప్రాంగణంలో మహిళలు వెలిగించిన కార్తీక దీపాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

Leave a Reply