భోగేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ నాగరాణి పూజలు

భోగేశ్వర స్వామి ఆలయంలో కలెక్టర్ నాగరాణి పూజలు
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో: కార్తీక మాసం సందర్భంగా శైవాలయాలలో భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి (Chadalawada Nagarani) తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరంలోని భోగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి కార్తీక మాసం సందర్భంగా అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామివారికి జలాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం ఆలయ పూజారులు కలెక్టర్ గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ, ప్రసాదాలను, ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంలో భీమవరం ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు రావూరి బ్రహ్మాజీ, సెక్రెటరీ దారపురెడ్డి త్రివిక్రమ్, కోశాధికారి దంగుమళ్ళ సుబ్బారావు, తదితరులు ఉన్నారు.
