ఇందిర వర్ధంతి వేడుకల్లోనూ వర్గ విబేధాలు

  • డిసిసి ప్రెసిడెంట్ వేసిన మాలను తీసేసిన కొండా టీం
  • మంత్రి రాకతో వెళ్లిపోయిన మాజీ మేయర్

ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : ఓరుగల్లు రాజకీయాల్లో కొండా కపుల్స్ రూటే సఫరెట్ గానే కొనసాగిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులతో రాజీ పడకపోవడం ఎత్తుగడగా భావించవచ్చు.కానీ సొంత పార్టీల నేతలతో ఏర్పడ్డ రాజకీయ విభేదాలను పరిష్కారించుకొనే కనీస ప్రయత్నాలు చేయడం లేదు. పైగా ఆధిపత్య నిరూపణ కోసమే ప్రయత్నిస్తుండటంతో కొండా కపుల్స్ తీరు వివాహదాస్పదంగానే కొనసాగుతోంది.

ఓరుగల్లు పాలిటిక్స్ లో మంత్రి కొండా సురేఖ తగ్గేదేలే అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అధిష్టానం ఆగ్రహించిన, పీసీసీ క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చిన డోంట్ కేర్ అన్నట్టుగానే వారి ప్రయాణం సాగిస్తున్నారు.ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన మంత్రి కొండా సురేఖ ఆధిపత్యపోరులో వెనకడుగు వేసేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

ఎవ్వరేమీ అనుకొన్న …తమ రూటే సఫరెట్ అని చెప్పకనే చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో తమది వన్ మెన్ షో గానే చాటుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో ఏ ప్రజాప్రతినిధులతో సఖ్యత,సయోధ్య లేకున్నా మంత్రివర్గంలో కొనసాగడాన్ని బట్టే తమ పొలిటికల్ పవర్ ఏ పాటిదో…అర్థం చేసుకోవాలనే సంకేతాలతోనే పొలిటికల్ వార్ కొనసాగిస్తున్నట్టు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈస్ట్ లో కొండానే సుప్రీమ్

వరంగల్ తూర్పు నియోజక వర్గం శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ తన నియోజకవర్గంలో మరొకరి జోక్యాన్ని సహించడం లేదు. తమ కాన్యూస్ట్యూన్సీలో సొంత పార్టీ నేతలు కూడా అడుగు పెట్టొద్దు అనే తమ తీరును మార్చుకోవడానికి కూడా ఏ మాత్రం ఇష్టపడటం లేదు. తమ నియోజకవర్గంలో మిగతా కాంగ్రెస్ నేతల జోక్యాన్ని కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పైగా కాన్యూస్ట్యూన్సీ లో నివాసముందే నేతల చర్యలను సైతం తప్పుబడుతున్నారు.

వర్ధంతిలోను విబేధాలు

స్వర్గీయ ఇందిరా గాంధీ 41వ, వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నేతల తీరు వర్గ విబేధాలు బట్ట బయలయ్యాయి.వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు,మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ కాశిబుగ్గలోని ఇందిరాగాంధీ విగ్రహంకు పూలమాల వేసి నివాళు లర్పించారు.అదే సమయంలో మంత్రి కొండా సురేఖ రావడంతో పోలీసుల సూచన మేరకు ఎర్రబెల్లి స్వర్ణ అక్కడ నుండి నిష్క్రమించారు. కానీ కొండా వర్గీయులు డిసిసి చీఫ్ స్వర్ణ వేసిన పూలమాలను తొలగించారు.

ధీంతో డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ వర్సెస్ మంత్రి కొండా సురేఖ అన్నట్లుగా మారింది. ఎర్రబెల్లి స్వర్ణ వేసిన పూలమాలను తొలగించిన తర్వాతనే మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూలమాలను ఇందిరాగాంధీ విగ్రహంకు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సంఘటనతో వరంగల్ కాంగ్రెస్‌లో వర్గ విబేధాలతో పాటు ఆధిపత్య పోరు పాలిటిక్స్ బయట పడ్డాయి.మంత్రి సురేఖ,ఎర్రబెల్లి స్వర్ణల మధ్య నెలకొన్న విభేదాలు మరోమారు బట్టబయలయ్యాయి.

అదే తీరు…అదే పద్ధతి

గత కొద్ది నెలలుగా ఓరుగల్లు రాజకీయాల్లో కొండా కపుల్స్ తీరు వివాహదాస్పదంగా మారిన విషయం తెల్సిందే.సహచర ప్రజాప్రతినిధులతో ఏ మాత్రం పోసాగడం లేదు.చివరకు డిసిసి నేత తోను సత్సంబంధాలు కొనసాగించడం లేదు. ఈస్ట్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నాటి నుండి ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. తాజాగా ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలోను మరోసారి ఆజ్యం పోసినట్లయింది.

మాజీ ప్రధాని వర్ధంతిని నేతలు వేర్వేరుగా నిర్వహించడమే కాక ఒకరు ఉన్న చోట మరొకరు ఉండక పోవడంను బట్టే ఇరువురు నేతల మధ్య ఉన్న సంబంధ, బాంధ్యవ్యాలేమిటో… అవగతమవుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి తో ఏర్పడ్డ విభేదాలను పరిష్కారించుకొన్న కొండా కపుల్స్ ..జిల్లా నేతలతో మాత్రం తగ్గదేలే అన్నట్టుగా వ్యవహరిస్తుందటమే హాట్ టాపిక్ గా మారింది.

Leave a Reply