- వైసీపీ మండలాధ్యక్షుడు వెంకటేశ్వర్లు
ఆంధ్రప్రభ, శావల్యాపురం (గుంటూరు ) : కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పీపీపీ విధానంతో పేద విద్యార్థులకు వైద్య విద్య భారంతో పాటు వైద్య సేవలు దూరం అవుతాయని శావల్యపురం మండలం వైసీసీ అధ్యక్షుడు బోడెపూడి వెంకటేశ్వర్లు (కొండలు) విమర్శించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పిలుపుతో మండల పార్టీ అధ్యక్షుడు బోడెపూడి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మండలంలోని శావల్యాపురం, పొట్లూరు, ఇర్లపాడు, కొత్తలూరు గ్రామాలలో శుక్రవారం రచ్చబండ నిర్వహించారు.
ప్రజల ఆమోదంతో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో సామాన్య ప్రజానీకానికి విద్యా, వైద్యం అందుబాటులో లేకుండా పోతుందని, ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు రంగానికి అప్పజెప్పడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమేనని దుయ్యబట్టారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నిర్మించే పాలకులకు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే వైద్యశాలలను నిర్మించకపోవడం శోచనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బోడెపూడి శ్రీనివాసరావు, కారుమంచి మాజీ సోసైటీ అధ్యక్షుడు బొల్లా శివ, పొట్టిపాటి శ్రీనివాసరావు, కొణతం ఏరుకుల రెడ్డి, ఎంపీటీసీ పోతురాజు, గుర్రం గోవిందరాజు, అబ్బూరి అయ్యన్న, మండల యూత్ అధ్యక్షుడు బొల్లా సుబ్బారావు, మొగిలి గురవయ్య పాల్గొన్నారు.

