నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యం..

ఆంధ్రప్రభ, చౌటుప్పల్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మునిసిపాలిటీలోని లింగోజిగూడెం గ్రామంలో (శుక్రవారం) దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఇద్దరు నిందితులు అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

పోలీసుల కథనం ప్రకారం

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కుటుంబం జీవనోపాధి కోసం లింగోజిగూడెంలో నివసిస్తోంది. తల్లి ఇంటి ముందు బట్టలు ఉతుకుతుండగా, ఆమె కుమార్తె ఇతర పిల్లలతో ఆడుకుంటోంది. ఈ సమయంలో అదే ప్రాంతంలో నివసిస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన దినేష్, శివరాజ్ అనే ఇద్దరు వ్యక్తులు చాక్లెట్ ఇస్తామని చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు మూసి అఘాయిత్యానికి పాల్పడ్డారు.

బాలిక కేకలు వేయడంతో పొరుగువారు అప్రమత్తమై గది తలుపులు బలవంతంగా తెరిచి బాలికను రక్షించారు. నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు బాలికను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం మరింత వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి పంపించారు. నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు చౌటుప్పల్ ఇన్‌స్పెక్టర్ మన్మధ కుమార్ తెలిపారు.

Leave a Reply