మోత్కూర్, (ఆంధ్రప్రభ) : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ పరిధిలోని జామచెట్ల బావి వద్ద ఉత్తరాది చెరువు అలుగుపొయడంతో సుమారు 50 ఎకరాల్లో వరి పొలాలు నీట మునిగాయి. గత 2 రోజులుగా నీట మునిగిన 2 ఎకరాల వరి పైరుని శుక్రవారం రైతు నారాయణ కట్టలు కడుతూ నానా ఇబ్బందులు పడ్డాడు. రైతులు బుర్ర రాములు, నర్సయ్య, బీసు మల్లేష్, మర్రి మల్లయ్య, బండారు సోమయ్యలు చేతికందివచ్చిన వరి పంటలు నేలకొరిగాయని తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.
నష్టపరిహారం అందించాలి..

