పెంటపాడులో ప్రారంభించిన భీమవరం కలెక్టర్

పెంటపాడులో ప్రారంభించిన భీమవరం కలెక్టర్

భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లాలో తొలి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ చదలవాడ నాగరాణి(Collector Chadalawada Nagarani) గురువారం ప్రారంభించారు. పెంటపాడు మండలం రావిపాడు ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం లో ఏర్పాటు చేసిన ఖరీఫ్ తొలి ధాన్యం కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించగా.. ధాన్యములోడు లారీని రైస్ మిల్లుకు తరలించేందుకు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్(Bolisetty Srinivas) జండా ఊపి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ రైతులు ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని లక్ష్యంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులు ఎవరి వద్ద నష్టపోకుండా ప్రభుత్వం కల్పించిన గిట్టుబాటు ధరకే వారి ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు. ఏ రైతు కూడా నాణ్యతా ప్రమాణాల ప్రకారము ఉన్న తన పంటని కనీస మద్దతు ధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేదన్నారు.

దళారులు లేక మధ్యవర్తులు, మిల్లర్ల(Millerla) చేతిలో రైతులు నష్టపోకూడదన్నారు. ఈ-పంట నమోదు చేసుకొని, ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతుల వద్ద మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం విక్రయంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఫిర్యాదు చేయటానికి ప్రతి జిల్లా కేంద్రంలో, రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్(Control Room) ఏర్పాటు చేశామన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1967 లో సంప్రదించవచ్చు అన్నారు.

జిల్లా స్థాయిలో జిల్లా కంట్రోల్ రూమ్ నెంబర్లు.. 8121676653, 18004251291లో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి(Rahul Kumar Reddy), తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతీబ్ కౌసర్ భానో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా సహకార శాఖ అధికారి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం స్పెషల్ ఆఫీసర్ జీవీకే మల్లికార్జునరావు, సివిల్ సప్లైస్ ఎం.డి ఎండి ఇబ్రహీం, తహసిల్దార్లు రాజరాజేశ్వరి పాల్గొన్నారు.

Leave a Reply