విద్యార్థులు లక్ష్యాలను…

బూర్గంపాడు, అక్టోబర్ 30 (ఆంధ్రప్రభ): విద్యార్థినీలు తమ లక్ష్యాలను సమయస్ఫూర్తితో సాధించాలి అని భద్రాచలం సబ్ కలెక్టర్ (Bhadrachalam Sub-Collector) మృణాల్ శ్రేష్ట సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గం పహాడ్ మండల కేంద్రంలోని స్థానిక మైనారిటీ బాలికల పాఠశాలను గురువారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ గీతా జ్యోతి ఆయనకు పుష్పగుచ్చం అందించి ఘన స్వాగతం పలికారు. తరగతి గదులను కోసతిగృహం ,సిక్ వంటగది, లైబ్రరీ సైన్స్ ల్యాబ్ రూమ్ వాష్రూమ్స్ ప్రొవిషన్ గది వంటి ప్రతి వాటిని క్షుణ్ణంగా పరిశీలించారు.

ప్రతిరోజు విద్యార్థులకు వడ్డించే భోజన మెనూ ఆహార నాణ్యతను పరిశీలించారు. వంటగది పరిశుభ్రతను పరిశీలించి వంట సిబ్బందిని అభినందించారు. అనంతరం విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడారు విద్యార్థులలోని చదువు, విషయ పరిజ్ఞానాన్ని ,సాంకేతిక అవగాహనను, ఆంగ్లభాషపై పట్టును, సామాజిక చైతన్యం వాటిని వారితో చర్చించి సంతృప్తి చెందారు . విద్యార్థులకు అవసరమైన మరిన్ని లైబ్రరీ పుస్తకాలు విషయపరిజ్ఞాన అభివృద్ధికి ప్రొజెక్టర్ ను అందజేస్తానని హామీ ఇచ్చారు.పాఠశాలలోని విద్యార్థుల క్రమశిక్షణను, పాఠశాల పరిసరాల పరిశుభ్రతను, ఉపాధ్యాయనీల నిబద్ధతను గమనించి పాఠశాల ప్రిన్సిపాల్ గీత జ్యోతి ను అభినందించారు.

Leave a Reply