పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి

పనులను పరిశీలించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి
కడప ప్రతినిధి, ఆంధ్రప్రభ : కడప నగరంలో వరద నీటితో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కార పనులు చేపట్టారు. అప్సర సర్కిల్ పరిసర ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నాయి. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించమని ప్రజలు కోరారు. ప్రజల కోరిక మేరకు చేపట్టిన పనులను టీడీపీ పొలిట్‌బ్యూరో(TDP Politburo) సభ్యులు, జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి బుధవారం స్వయంగా పరిశీలించారు.
బుగ్గ వంక ప్రాంతంలోని షామీర్య బ్రిడ్జ్, జువెనైల్ హోమ్(Shamirya Bridge, Juvenile Home) సమీప ప్రాంతాల్లో వర్షపు నీటి ప్రవాహ పరిస్థితిని కూడా ఆయన ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షాల సమయంలో నీరు నిలిచిపోకుండా కొనసాగుతున్న డ్రైనేజ్ వ్యవస్థ పనులు వేగంగా చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల నీటి నిల్వలు తొలగి, ప్రజలకు ఇబ్బందులు తగ్గుతున్నాయని మున్సిపల్ అధికారులు శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy)కి వివరించారు. ఈ సందర్భంగా పనులను సమర్థంగా నిర్వహిస్తున్న మున్సిపల్ అధికారులు, వారి సిబ్బందిని శ్రీనివాస రెడ్డి అభినందించి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఇటీవలవర్షాలతో ఎదురైన ఇబ్బందులు పునరావృతం కాకుండాకడప నగరంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల నీటి ప్రవాహం సజావుగా కొనసాగుతూ ప్రజలకు ఇబ్బందులు తగ్గుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కడప నగర సిటీ ప్రెసిడెంట్ లయన్ పటాన్ మన్సూర్ అలీఖాన్(Lion Patan Mansoor Ali Khan) ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.
