ఇలా చేస్తే.. కేసులు నమోదు

ఇలా చేస్తే.. కేసులు నమోదు

నిజాంపేట, ఆంధ్రప్రభ : డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and drive)లో పట్టుబడితే 10,000 జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధించడం జరుగుతుందని నిజాంపేట ఎస్ఐ రాజేష్(SI Rajesh) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి వాహనాలు నడిపే వారి పై పదివేల రూపాయల జరిమానా లేదా ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుందన్నారు.

రెండవసారి మద్యం సేవించి వాహనం నడిపే వారిపై 15 వేల రూపాయల జరిమానా.. కట్టని వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందన్నారు. వాహనదారులకు ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం(alcohol) సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్ బాలులకు వారి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనల(traffic rules)ను రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. ఎవరైనా నిబంధనలను పాటించకపోతే వారిపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

Leave a Reply