ఓరుగల్లులో భారీ వర్షం

ఓరుగల్లులో భారీ వర్షం

వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : ఓరుగల్లు (Orugallu) లో ఒక వైపు జోరు వాన, మరో వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో జనాలు వణికి పోతున్నారు. మొంథా తుపాన్ తీవ్రతతో తెల్లవారినప్పటికి మొంథా తుపాన్ ఎఫెక్ట్ తో కారు మబ్బులు కమ్మి చీకటిని తలపిస్తోంది. వీస్తున్న చలి గాలులతో పాటు కురుస్తున్న వర్షంతో ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావడానికే జంకుతున్నారు. చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం క్రమక్రమంగా పెరిగి భారీ వర్షం పడుతోంది.

వరంగల్, హన్మకొండ, కాజీపేట లలో వర్ష ప్రభావం కనిపిస్తోంది. అత్యవసర పనులుంటే తప్ప బయటకు రావడానికి నగర వాసులు వెనుకాడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొంథా తుపాన్ తీవ్రత ఉంది.

మహబూబాబాద్ (Mahbubabad) జిల్లాలో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రధాన రోడ్లు రాకపోకలు అంతగా లేక బోసిపోయి దర్శనమిస్తున్నాయి. జనాలు సైతం స్వేటర్లు వేసుకుని,వర్షంకు తడువకుండా ఉండేందుకు గాను గొ డుగులు పట్టుకొని బయటకు వస్తున్నారు. మొంథా తుపాన్ ఎఫెక్ట్ ఓరుగల్లు ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఉరుములు, మెరుపులతో పాటు కురుస్తున్న వర్షంతో పాటు పిడుగులు పడుతున్న శబ్దాలు భయభ్రాంతులకు గురి చేస్తోంది.


మొంథా తుపాన్ తీవ్రతతో ఓరుగల్లు పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలంటూ విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నిండి ఉన్న ఊరు చెరువులు, కుంటలు నిండుకుండాలా మారాయని, అటువైపుగా ఎవ్వరు వెళ్ళద్దు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని చెరువులు మత్తడి పొసే అవకాశం ఉందని, అలాగే వాగులు పొంగే పొర్లే ప్రమాద పరిస్థితులు పొంచి ఉన్నాయని ఆయా ఠాణాల పోలీస్ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మత్తడి పోస్తున్న చెరువులు, పొంగి పొర్లుతున్న వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అత్యావసర పనులపై ప్రయాణాలు చేస్తున్న వారంతా రోడ్డుపై ఉన్న గుంతలను గమనిస్తూ నెమ్మదిగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేసి పోలీస్ సేవలు పొందాలన్నారు.

Leave a Reply