పీడన తట్టుకోలేక
- మడకశిర దంపతులు ఆత్మహత్యాయత్నం
మడకశిర , ఆంధ్రప్రభ : పండ్ల వ్యాపారంలో నష్టం రావడంతో ఇవ్వాల్సిన అప్పు ఇవ్వలేని పరిస్థితుల్లో అప్పుధారులు ఇంటి వద్ద బైటాయించి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో విధిలేని పరిస్థితిలో భార్యాభర్తలు ఆత్మహత్యయత్నంకు పాల్పడిన సంఘటన గుడిబండ మండలం దేవర హట్టి గ్రామంలో చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… దేవర హట్టి గ్రామానికి చెందిన మా రెక్క, కాంతా రాజు దంపతులు బెంగళూరులో పండ్ల వ్యాపారం చేస్తున్నారు. కర్బూజా పండ్లను కళ్యాణ్ దుర్గంకు చెందిన పాపిరెడ్డి, తిమ్మారెడ్డి, రామంజి తదితర టెంపో వాహనదారులు సరఫరా చేసేవాళ్లు. వారికి ఈ దంపతులు 80 లక్షల రూపాయలు ఇవ్వాలని రెండు రోజులుగా పాతిరెడ్డి తిమ్మారెడ్డి రామాంజి తదితరులు వేధిస్తుండడంతో అందులోనూ రెండు రోజుల క్రితం కారులో కాంతరాజును తీసుకొని వెళ్లడంతో కుటుంబ సభ్యులు భయపడి గుడిబండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు.
రెండు రోజులగా ఇంటివద్దె అనేక మందిని తీసుకొని వచ్చి డబ్బు డిమాండ్ చేయడంతో కొంత సమయం ఇవ్వాలని వేడుకొన్నా ఇవ్వకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో పురుగుమందును సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సందర్భంగా గ్రహించిన గ్రామస్తులు మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వచ్చి చికిత్స అందించారు.మారెక్క విలేకరులతో మాట్లాడుతూ తాము కూడా బెంగళూరులో కోటి రూపాయలకు పైగా పండ్ల వ్యాపారులకు అప్పు ఇచ్చామని ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల కొంత నష్టం వాటిల్లిందని ఆరు నెలల సమయం కావాలని వేడుకొన్న సమయం ఇవ్వకపోగా…. తమ ఇంటి వద్ద గుంపుగా వచ్చి తిష్ట వేసి వేధిస్తున్నారని ఆ వేధింపులకు తాళలేకనే ఈ ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డామని ఆమె వాపోయారు.
తన మాంగల్యాన్ని సైతం అమ్మి వారికి డబ్బు కట్టానని కొంత సమయం ఇచ్చి ఉంటే వారు డబ్బు వసూలు చేసి ఇచ్చేవారేమని వారి వేధింపులు తాళలేక అందులోనూ తన భర్తను మాట్లాడుదాము రా అని కారులో తీసుకెళ్ళి బెదిరించారని దాంతో నా భర్త భయపడి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించి ఇద్దరు కలిసి పురుగుల మందు సేవించామని ఆవేదనతో తెలిపారు.
వారి వద్ద నుంచి పండ్లు కొనుగోలు చేసి తాము కూడా బెంగళూరులోని వ్యాపారస్తులకు ఇచ్చామని వారి నుంచి రావడం ఆలస్యమైన నేపథ్యంలోనే వీరికి ఇవ్వలేకపోతున్నామని ఆమె తెలిపారు సమయం ఇస్తే వారి అప్పులు చెల్లిస్తామని కూడా ఆమె పేర్కొన్నారు.

