ఉన్నత, ప్రాథమిక పాఠశాలల శుభ్రతపై సూచన..
నిర్మల్ జిల్లా దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : ఇంటి పన్ను వసూలు 100% పూర్తిచేయాలని డీపీఓ శ్రీనివాస్(DPO Srinivas) అన్నారు. ఈ రోజు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీని ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. గ్రామ పంచాయతీలో ఉన్న ఎలక్షన్ సామాగ్రిని పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం మండల కేంద్రంలోని జడ్పి ఉన్నత, ప్రాథమిక(Higher, Primary) పాఠశాలలను పరిశీలించారు. పాఠశాలల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందికి తెలియజేశారు. గ్రామాలలోని వీధుల గుండా నడుచుకుంటూ వెళ్లి మురుగు కాలువలను పరిశీలించి నీరు నిల్వ ఉండకుండా ఎప్పటికప్పుడు శుభ్రం(Clean) చేయాలని గ్రామపంచాయతీ కార్యదర్శి కి సూచించారు. రోడ్ల వెంట పిచ్చి మొక్కలు లేకుండా చూడాలని తెలిపారు.
ఇందులో తహసీల్దార్ బత్తుల విశ్వంబర్(Bathula Vishwambar), దస్తూరాబాద్ ఎంపీడీఓ సునీత, పెంబి ఎంపీడీఓ రమేష్, ఎంపీవో రమేష్ రెడ్డి, జీపీవో నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు ఉన్నారు.

