వాటిని ఫ్రీగా వదిలేయాలి..

కోట, అక్టోబర్ 28 (ఆంధ్రప్రభ) : తిరుపతి జిల్లా (Tirupati District) కోటమండలం గూడలి గ్రామ పంచాయతీలోని స్వర్ణముఖి నది నుండి చల్ల కాలువ వరకు 16 కిలోమీటర్లు ప్రయాణించి కొత్తపట్నం గ్రామ పంచాయతీలోని మత్స్యకారుల గ్రామం గోవింద పల్లిపాలెం వద్ద సముద్రంలో కలుస్తుంది. తుఫాన్ తీవ్ర ప్రభావం దాల్చడంతో మంగళవారం తుఫాన్ స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, తాహసిల్దార్ కటారి జయ జయరావు గోవిందపల్లిపాలెం వద్ద చల్ల కాలువ సముద్రంలో కలిసే ముఖద్వారాన్ని పరిశీలించారు. గతంలో తుఫాను తాకిడి వరదల వల్ల సముద్రం ఉప్పొంగి గోవిందపల్లిపాలెం 20 రోజులు పాటు జల దిగ్బంధంలో ఉండింది.

ఈ సందర్భంగా తాహసిల్దార్ జయ జయ రావు (Tahsildar Jaya Jaya Rao) తుఫాను తాకిడి వల్ల ఎగిసి పడే సముద్రపు అలలు, ఈదురు గాలులు వల్ల జరిగే అనర్థాలను మత్స్యకార పెద్దకాపులకు ప్రజలకు వివరించి వారిని పునరావాస కేంద్రానికి తరలించేందు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. ప్రజలు విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలన్నారు. జీవాలను పశువులను తాడులతో కట్టకుండా ఫ్రీగా వదిలేయాలన్నారు.

Leave a Reply