కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు

కర్నూలు జిల్లాలో వాగులు, వంకలు పరవళ్లు

(కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో) : కర్నూలు జిల్లాలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు పలుచోట్ల తేలికపాటి నుంచి మధ్యస్థంగా వర్షపాతం నమోదైంది. వాయువ్య దిశలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మేఘావృత వాతావరణం నెలకొనగా, జిల్లాలోని 21 మండలాల్లో వర్షం కురిసింది. ఈ సందర్భంగా కర్నూలు అర్బన్ లో 17.40 మిల్లీమీటర్లు, కల్లూరు లో 13.0 మిల్లీ మీటర్లు, ఒర్వకల్ మండలంలో 13.5 మిల్లీమీటర్లు కోసిగి మండలంలో అత్యధికంగా 11.4 మిల్లీమీటర్ల వర్ష పాతం నమోదైంది.

ఈ మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. గోనెగండ్ల, వెల్దుర్తి మండలాల్లో అత్యల్పంగా 0.4 మిల్లీమీటర్లు మాత్రమే నమోదయ్యాయి. ఇక హోళగుంద, కోడుమూరు మండలాల్లో మాత్రం ఎటువంటి వర్షపాతం నమోదు కాలేదు. జిల్లా స్థాయి వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, జిల్లా మొత్తం వర్షపాతం 295.2 మిల్లీమీటర్లు, కాగా జిల్లా సగటు వర్షపాతం 11.4 మిల్లీమీటర్లుగా నమోదైంది.

మంత్రాలయం – 20.6 మి.మీ , దేవనకొండ – 22.0 మి.మీ,
నందవరం – 22.4 మి.మీ, కోసిగి – 11.4 మి.మీ, కర్నూలు అర్బన్ – 17.4 మి.మీ, కల్లూరు – 13.0 మి.మీ, అలూరు – 9.6 మి.మీ, మద్దికెర – 9.0 మి.మీ, హాలహర్వి – 8.4 మి.మీ, పెద్దకడబూరు – 9.2 మి.మీ, ఒర్వకల్ – 11.5 మి.మీ,

జిల్లాలో నైరుతి రుతుపవనాలు బలహీన స్థితిలో కొనసాగుతున్నప్పటికీ, ఈశాన్య రుతుపవనాల ప్రభావం క్రమంగా పెరుగుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. 2025–26 నైరుతి రుతుపవనాల కాలానికి ఇప్పటివరకు 218 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, అలాగే ఈశాన్య రుతుపవనాల సగటు వర్షపాతం 81.1 మిల్లీమీటర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు. వచ్చే 24 గంటల్లో కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రైతులు పంటల సంరక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Leave a Reply