జుక్కల్ మండలానికి స్పోర్ట్స్ స్కూల్…

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతూ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా, మారుమూల ప్రాంతమైన జుక్కల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, వారికి సరైన శిక్షణ, అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో స్పోర్ట్స్ స్కూల్ స్థాపనకు కృషి చేశారు.

ఆయన వాగ్దానం చేసినట్లుగానే, జుక్కల్ మండలానికి కోట్లాది రూపాయల వ్యయంతో ప్రభుత్వం స్పోర్ట్స్ స్కూల్ మంజూరు చేసింది. మండలంలోని మొహ్మదాబాద్ గ్రామంలో రెండు ప్రధాన రోడ్ల మధ్య విస్తారమైన ప్రభుత్వ స్థలం లభ్యమవడంతో, అక్కడే స్పోర్ట్స్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఈ స్పోర్ట్స్ స్కూల్ మంజూరుతో ప్రాంతీయ క్రీడాకారులు, శిక్షకులు, క్రీడాభిమానులు, అలాగే నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జుక్కల్ నుంచి భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా ప్రతిభ వెలుగులు విరజిమ్ముతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply