త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తులు…

వెల్గటూర్, ఆంధ్రప్రభ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటిలింగాల పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం గోదావరి తీరంలో గంగా హారతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కాంతారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పుదరి రమేష్, ధర్మకర్త గుమ్ముల వెంకటేష్, అర్చకులు సంజీవ్ శర్మ, నాగరాజు శర్మ, అన్వేష్ శర్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply