కోసిగి – హాల్వి మధ్య రాకపోకలు బంద్
కోసిగి (కర్నూలు జిల్లా), ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లాలో ఈ రోజు మధ్యాహ్నం కురిసిన భారీ వర్షంతో కోసిగి శివార్లలోని కోసిగి. హాల్వి(Kosigi. Halvi), రోడ్డు లోని చేప వంక పొంగిపొర్లింది. భారీగా వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. చేప వంకకు రెండు వైపు ల, భారీగా ట్రాఫిక్ జామ్ కాగ.. ఊరుకుంద వెళ్లే భక్తులు. విద్యార్థులు, ఉద్యోగులు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అదే సమయంలో పాఠశాలలు వడలడంతో గ్రామాలకు వెళ్లే విద్యార్థులు అష్టకష్టాలు పడుతూ ఇతరుల సహాయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వంకను దాటారు. పొలాలకు వెళ్లిన రైతులు, కూలీలు, వందలాదిమంది వంక దాటలేక రెండు గంటలు(two hours) పైగావంకకు రెండు వైపులా నిలబడిపోయారు. ఎట్టకేలకు ఇతరుల సహాయంతో వంకను దాటి గమ్యాలకు చేరుకొని ఊపిరి పీల్చుకున్నారు.
కోసిగి లోని సాయిబాబా కాలనీలో నివాసం ఉంటున్న ఉద్యోగస్టులతోపాటు, వివిధ గ్రామాలనుండి కోసిగికి వైపు వస్తున్న ఉద్యోగస్తుల కష్టాలు మరి వర్ణాతీతం అని చెప్పవచ్చు, చాలాసేపు తరువాత స్థానికుల సహాయంతో పొంగిపొర్లుతున్నావంకను దాటి ఇళ్లకు చేరుకున్నారు. భారీగా తుఫాను(severe storm) ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏఒక్క అధికారి కూడా పొంగిపొర్లుతున్నా చేప వంక దగ్గరకు చేరుకోలేదు.
దీంతో ప్రజలు, ఉద్యోగస్తులు(employees), ఊరుకుంద భక్తులు విద్యార్థులు, రైతులు, కూలీలు పడుతున్న కష్టాలను పట్టించుకునే నాధుడే లేరంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.. వరద నీరు తగ్గిన తరువాత ఎస్సై హనుమంత రెడ్డి(Hanumantha Reddy) సిబ్బందితో వంక దగ్గరకు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేయడం జరిగింది.ఇప్పటికైనా ప్రజలు పడుతున్నకష్టాలను గమనించి వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి చేప వంకపై బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

