క‌లెక్ట‌రేట్ ఎదుట‌ ఆందోళ‌న‌

క‌లెక్ట‌రేట్ ఎదుట‌ ఆందోళ‌న‌

పెద్ద‌ప‌ల్లి రూర‌ల్‌, ఆంధ్ర‌ప్ర‌భ : త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల‌ని హ‌మాలీలు ఆందోళ‌న‌కు దిగారు. ఈ రోజు క‌లెక్ట‌రేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వ‌ర్యంలో ధర్నా నిర్వహించారు. హమాలీల‌ సమస్యలు పరిష్కరించాలని, హమాలీ కార్మికుల(porter workers)కు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని సీఐటీయూ(CITU) జిల్లా కార్యదర్శి సీపెల్లి రవీందర్ డిమాండ్ చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నినాదాలు చేశారు. అనంతరం ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply