జస్టిస్ గవాయ్ రికమండెడ్ .. కేంద్ర ఆదేశం ఆలస్యం

జస్టిస్ గవాయ్ రికమండెడ్ .. కేంద్ర ఆదేశం ఆలస్యం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : భారత సర్వోన్నత న్యాయస్థానం కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ సూర్యకాంత్(Justice Suryakant) పేరును సీజేఐ భూషణ్ రామకృష్ణ గవాయ్ సిఫారసు చేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రికి జస్టిస్ సూర్యకాంత్ పేరును గవాయ్ రికమండ్ చేశారు. గవాయ్ వారసుడి ఎన్నిక ప్రక్రియను కేంద్ర ఇటీవల ప్రారంభించింది.

నిబంధనల ప్రకారం సుప్రీంకోర్టు సీనియర్ జడ్జిని సీజేఐ(CJI) పదవికి ఎంపిక చేస్తారు. ప్రస్తుతం అత్యున్నత న్యాయస్థానంలో జస్టిస్ సూర్య కాంత్ మోస్ట్ సీనియర్ న్యాయమూర్తిగా ఉన్నారు. గవాయ్ నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో దేశ 53వ సీజేఐగా జస్టిస్ కాంత్ బాధ్యతలు చేపడతారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకూ ఆయన ఈ పదవిలో ఉంటారు.

హర్యానాలోని హిస్సార్‌(Hissar)లో 1962 ఫిబ్రవరి 10న జస్టిస్ సూర్యకాంత్ జన్మించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. 370వ అధికరణ రద్దు, భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, అవినీతి, పర్యావరణం, లింగ సమానత్వం వంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో ఆయన ఉన్నారు.

ఎన్నికల జవాబుదారీతనంపై తన నిబద్ధతను చాటుకుంటూ బీహార్ ఓటర్ల జాబితా(Bihar Voter List) నుంచి తొలగించిన 65 లక్షల మంది వివరాలను వెల్లడించాలని ఇటీవల ఎన్నికల కమిషన్‌ను ఆయన ఆదేశించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌తో సహా బార్ అసోసియేషన్లలో మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు రిజర్వ్ చేయాలని చారిత్రక ఆదేశాలు సైతం ఇచ్చారు.

2022లో ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాలపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించిన ధర్మాసనంలో ఆయన కూడా ఉన్నారు. రక్షణ బలగాలకు ఓఆర్ఓపీ స్కీమ్‌ను సైతం ఆయన ధ్రువీకరించారు. పెగాసస్ స్పైవేర్ కేసును విచారించిన ధర్మాసనంలోనూ జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.

Leave a Reply