Deputy CM పవన్ కు రాజేంద్ర ప్రసాద్ ఆత్మీయ సత్కారం
మంగళగిరి : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ నేడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిశారు. ఈ ఉదయం మంగళగిరిలోని డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన రాజేంద్ర ప్రసాద్ డిప్యూటీ సీఎం తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు..
ఈ సందర్భంగా పవన్ కు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఇరువురు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫొటోలను కూడా పంచుకుంది. .