డ్రా ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌భ తెలంగాణ న్యూస్ నెట్ వ‌ర్క్ : తెలంగాణ (Telangana) లో మద్యం దుకాణాల ఎంపిక కోసం లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. దుకాణాలు ఎవ‌రికి వ‌స్తాయో అని ద‌ర‌ఖాస్తు దారులు ఎదురు చూస్తున్నారు. జిల్లాల్లో జిల్లా కలెక్టర్ల సమక్షంలో డ్రా తీస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2620 మద్యం దుకాణాలకు 95,137 దరఖాస్తులు వచ్చిన సంగతి తెలిసిందే .ఈ దరఖాస్తులకు డ్రా పద్ధతిలో లైసెన్స్ లు మంజూరు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 కేంద్రాల్లో ప్రక్రియ కొనసాగుతోంది. హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సరూర్ న‌గర్, శంషాబాద్ కేంద్రాల్లో లాట‌రీ తీస్తున్నారు.


ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్ లో మద్యం దుకాణాలకు డ్రా ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి డ్రా తీస్తున్నారు. డ్రా సందర్భంగా ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎవ‌రికి మ‌ద్యం షాపు ద‌క్కుతుందో అని ల‌క్ష్మీ గార్డెన్స్‌కు పెద్ద ఎత్తున టెండరు దారులు, మద్దతుదారులు హాజ‌ర‌య్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్‌ సూపరింటిండెండెంట్ సంతోష్, ఆర్డీవో వై.అశోక్ రెడ్డి, డీఎస్‌పీ శివరాం రెడ్డి, ఎక్సయిజ్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : పెద్ద‌ప‌ల్లి (Peddapalli) లో 2025-27 సంవత్సరాలకు గాను మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రారంభ‌మైంది. పెద్దపల్లి పట్టణం బందంపల్లి స్వరూప గార్డెన్ లో మద్యం దుకాణాలకు లైసెన్స్ లను అధికారులు డ్రా పద్ధతిలో ప్రారంభించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి తో కలిసి డ్రా పద్ధతిలో దుకాణాల కేటాయింపు ప్రక్రియ చేపట్టారు. దరఖాస్తు దారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply