రూ.15 వేలు తీసుకుంటుండ‌గా…

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, ఆంధ్ర‌ప్ర‌భ : ఓ గ్రామ ప‌రిపాల‌న అధికారి ఒక ప‌నిచేయ‌డానికి రూ.60 వేలు డిమాండ్ చేసి రూ.15 వేలు తీసుకుంటూ ఈ రోజు ఏసీబీ (ACB) అధికారుల‌కు చిక్కాడు. ముల‌క‌ల‌ప‌ల్లి త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వ‌హించారు. రూ.15 వేలు లంచం తీసుకుంటుండ‌గా వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ (Banoth Srinivas Nayak) ను ఏసీబీ అధికారులు ప‌ట్టుకున్నారు.

పూసుగేడెం గ్రామానికి చెందిన వ్య‌వ‌సాయ భూమి రిజిస్ర్టేష‌న్ (Land registration) కు సంబంధించి రూ.60 వేలను వీఆర్ఓ బానోత్ శ్రీ‌నివాస్ నాయ‌క్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బాధితుడు వద్ద నుండి రూ.40 వేలు తీసుకోగా మిగతా బాలన్స్ రూ.15 వేలు లంచం తీసుకుంటుండగా ఈ రో్జు ఉదయం 11 గంటల సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి ప‌ట్టుకున్నారు. ప్ర‌స్తుత విచార‌ణ కొన‌సాగుతోంది.

Leave a Reply